స్వతంత్ర వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కస్టడీ కోరుతూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై బుధవారం ఏసీబీ కోర్టులో విచారణకు వచ్చింది. అయితే మధ్యాహ్నాం ఒంటి గంటలకు ఈ పిటిషన్‌పై విచారణ చేపడతామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు. కస్టడీ పిటిషన్ తర్వాతనే మిగిలిన పిటిషన్లపై విచారణ చేపడతామని వెల్లడించారు. స్కిల్ డవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడును మరింత విచారించాల్సిన అవసరం ఉందని సీఐడీ పిటిషన్‌లో తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడును ఐదు రోజులు కస్టీడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై మరికాసేపట్లో విచారణ జరగనుంది. ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.