ఆస్తి పన్ను చెల్లించకుండా కొన్ని ఏళ్లుగా కాలయాపన చేస్తున్న మియాపూర్‌కు చెందిన ఆరిజిన్ ఫార్మా కంపెనీ గేట్లకు GHMC సిబ్బంది తాళాలు వేశారు. ఈ క్రమంలో GHMC సిబ్బందికి, ఆరిజెన్ కంపెనీ సిబ్బందికి స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఫార్మా కంపెనీ సిబ్బంది వ్యవహరించిన తీరుపై GHMC సిబ్బంది కంపెనీ ఎదుట భైఠాయించి నిరసన తెలిపారు. రూ.కోటి 42 లక్షల ఆస్తి పన్ను చెల్లించాలంటూ గతంలో జీహెచ్ఎంసీ సిబ్బంది నోటీసులు జారీచేసినా ఆరిజన్ ఫార్మా కంపెనీ యాజమాన్యం ఏ మాత్రం స్పందించలేదు. తాజాగా నోటీసులు పంపించినా స్పందన లేకపోవడంతో కంపెనీ గేట్లకు తాళాలు వేశారు GHMC సిబ్బంది.