జెమిలి ఎన్నికలు అనేవి ఒక పిచ్చి తుగ్లక్ చర్య అని.. దానిని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి అన్నారు. జెమిలి ఎన్నికలు ఆచరణ సాధ్యం కాదు అని అన్నారు. రాజ్యాంగ సవరణ చేసి దేశమంతా ఒకేసారి ఎన్నికలు ఆచరణకు సాధ్యం కాదని తేల్చి చెప్పారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వాడారనే దానిపై ఆయన స్పందించారు. జగన్మోహన్ రెడ్డిపై ఆ పార్టీ నాయకులు కార్యకర్తలకు నమ్మకం లేదన్నారు. అందుకే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు పార్టీలు మారుతున్నారన్నారు.