Gas Cylinder Price | Cooking gas prices Hiked by Rs.50 for domestic. Rs 350 for commercials:
కెవ్వు కేక…
వంటింట్లో ఉన్న భార్య హడావుడిగా హాల్ లోకి వచ్చింది.
టీవీ చూస్తున్న భర్త సుబ్బారావు కుర్చీలోంచి జారిపడిపోయి ఉన్నాడు.
జాగ్రత్తగా లేపి,
‘‘ఆ దిక్కుమాలిన రాజకీయ వార్తలు చూడొద్దని చెప్పానా?’’ అని గదమాయించింది.
‘‘అది కాదే, గ్యాస్ ధర ఒకేసారి రూ.50 పెంచేశారు. అది చూసి జారిపోయా’’ అన్నాడు…
‘‘సరే లెండి ఏం చేస్తాం’’…అని లోపలికెళుతుంటే…మళ్లీ సుబ్బారావు అన్నాడు.
‘‘నా భయమంతా నీ కోసమేనే’’…అన్నాడు
‘‘ఏం ఎందుకు?’’ ఆశ్చర్యంగా అడిగింది…
‘‘డొమెస్టిక్ సిలిండర్ తో పాటు, కమర్షియల్ సిలిండర్ ధర పెంచేశారు. అది ఏకంగా రూ. 350 చేసేశారు’’ అన్నాడు
‘‘అయితే’’ మళ్లీ క్వశ్చన్ మార్క్ పెట్టింది.
‘‘అదే నే…రేపటి నుంచి నువ్వు రోజూ టిఫిన్లు అవీ తెమ్మంటేనే కష్టం…ఎందుకంటే వాటి ధర ఏకంగా రూ.350 పెరిగింది కదా… అంటే ఇప్పుడు ఇడ్లీ రూ.30 ఉన్నది రూ.40 అవుతుంది. పూరీ రూ.40 అన్నది రూ.50 అవుతుంది. ఇక నుంచి వాడి దయ…మన ప్రాప్తం’’ అంటూ నిట్టూర్చాడు.
ఆ మాట విని…అయ్యబాబోయ్…అని భార్యామణి అక్కడే కూలబడిపోయింది.
అంతేకాదే…మరొకటి వింటే నీ గుండె గుభేల్ మంటుంది…
ఏమిటండీ అదీ…భార్య ఆందోళనగా అడిగింది…
మన కారు …కూడా ఎల్పీజీ గ్యాస్ పైనే నడుస్తుంది. ఇప్పుడు కారు తీయాలన్నా వాసిపోతుంది తెలుసా? అన్నాడు
ఆ…ఆ,.. ఇంకా ఏమైనా ఉన్నాయా? మరింత ఆందోళనగా అంది…
మనం రేపు ఆటో ఎక్కాలనుకున్నా…అది ఎల్పీజీ గ్యాస్ ఆటో అయితే ఆలోచించి ఎక్కాలి అన్నాడు…
ఇంకా….ఏడుపొక్కటే తక్కువ భార్యామణికి…
ఈ ఇంపాక్ట్ అంతా ట్రాన్స్ పోర్టుపై పడి…కూరగాయల ధరలు, కిరాణా ధరలు అన్నీ పెరిగి మన నెలవారీ బడ్జెట్ తడిసి మోపెడవుతుంది…
ఈ మాటలు వింటూనే భార్యమణి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది…
Gas Cylinder Price | ఇదండీ ఇప్పుడు ప్రతీ ఇంట్లో వినిపిస్తున్న మాట…అసలే పెరిగిపోయిన ధరలతో, జీఎస్టీలతో, ఇంటి పన్నులు, కుళాయి పన్నులకు తోడు, ఇన్ కం ట్యాక్స్ కటింగులు, మండిపోతున్న పెట్రోలు ధరలు, కొండెక్కి కూర్చున్న ఇంటి అద్దెలు రోజురోజుకి మధ్యతరగతి జీవి కుదేలైపోతుంటే, పేదవాడు మరింత అట్టడుక్కి వెళ్లిపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులపై గ్యాస్ బండ పిడుగుపాటులా పడింది.
Read Also: ఆ రూ.50లక్షల కోసమే ప్రీతి చనిపోయిందా?