Ganta Srinivasa Rao |తన రాజీనామా ఆమోదం అంటూ గత రాత్రి నుంచి జరుగుతున్న ప్రచారం.. వైసీపీ ఆడే మైండ్ గేమ్ మాత్రమేనని విశాఖ ఉత్తరం,టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి నా రాజీనామాను ఆమోదించారనే ప్రచారం చేస్తున్నారని అన్నారు. టీడీపీలో ఓ ఎమ్మెల్యే ఓటు వేయలేకపోతున్నారనే ఫీలింగ్ కలిగించాలనే ప్రయత్నం వైసీపీ చేస్తుందని దుయ్యబట్టారు. ఇలా చేస్తే.. వైసీపీ అసంతృప్తులు వెనక్కు తగ్గుతారనేది వైసీపీ ఆలోచన అని అన్నారు. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ నామినేషన్ పత్రాలపై ప్రపోజల్ సంతకం నాదేనని అన్నారు. ఓటర్ల లిస్టు వచ్చాక రాజీనామా ఆమోదించడం అనేది సాంకేతికంగా కుదరదు. అలా చేస్తే వైసీపీ పెద్ద తప్పు చేసినట్టేనని వ్యాఖ్యానించారు.
Follow us on: Youtube Instagram