చిన్నారులను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముఠాను అరెస్ట్ చేసి 16మంది చిన్నారులను కాపాడారు. బాలబాలికల్లో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల మేడిపల్లిలోని చిన్నారి విక్రయంతో ముఠా వ్యవహారం బయటపడింది. నాలుగు రోజుల క్రితం ఫిర్జాదిగూడలో 4.50 లక్షలకు ఆర్‌ఎంపీ డాక్టర్ శోభారాణి శిశువును విక్రయించారు. ఆమెతోపాటు సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు జరపడంతో ముఠా గుట్టురట్టయింది. మొత్తం 16 మంది చిన్నారులను ముఠాకు విక్రయిం చినట్లు నిర్ధారించారు. నెల నుంచి రెండేళ్ల వయసు పిల్లలను అమ్ముతున్నట్లు తెలిసిందని రాచకొండ సీపీ తరుణ్ జోషి తెలిపారు. పిల్లలను విక్రయించే ముఠాతో సంబంధమున్న ఏజెంట్లను పట్టుకున్నా మని, మొత్తం 8 మందిని అరెస్టు చేమని తెలిపారు. ఢిల్లీ, పుణెల నుంచి పిల్లలను తీసుకొచ్చి అమ్ముతు న్నారని, ఈ కేసులో మొత్తం 16 మంది మంది చిన్నారులను రక్షించామ న్నారు. ఢిల్లీ, పుణెలో ఉన్నవారిని పట్టుకునేం దుకు ప్రత్యేక బృందం వెళ్లిందన్నారు.