హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం కన్నుల పండుగగా జరుతోంది. ఈ మహా నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించేందుకు నగర ప్రజలే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలిరానుండటంతో.. తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు 600ల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అలాగే మెట్రో సేవలు కూడా అర్థరాత్రి 2 గంటల వరకూ అందుబాటులో ఉంటాయని మెట్రో అధికారులు తెలిపారు. ఇక దక్షిణ మధ్య రైల్వే అధికారుల నిర్ణయం ప్రకారం రాత్రిళ్లు కూడా ఎంఎంటీఎస్ రైళ్లు నడవనున్నాయి. ఇవాళ, రేపు ఈ సేవలు కొనసాగనున్నాయి.