గేమ్ ఛేంజర్ మేనియా మొదలైంది. గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ అయింది. దీంతో ఏపీలో అర్ధరాత్రి నుంచే షోలు మొదలయ్యాయి. తెలంగాణలో మాత్రం ఉదయం 4 గంటలకు షో మొదలైంది. డ్యాన్సులతో రామ్‌చరణ్ ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర సందడి చేస్తున్నారు.
మెగా ప్యాన్స్ మాత్రమే కాదు.. సినీ అభిమానులు ఎవరి నో విన్నా గేమ్ ఛేంజర్ గురించే వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నుంచి వచ్చిన భారీ పాన్ ఇండియా మూవీ కావడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఆఖరికి గేమ్ ఛేంజర్ థియేటర్స్ లోకి వచ్చింది. మరి.. గేమ్ ఛేంజర్ ఎలా ఉంది..? బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ పరిస్థితి ఏంటి..? నయా రికార్డ్స్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉందా..? లేదా..? గేమ్ ఛేంజర్ రియల్ రిపోర్ట్ ఏంటి..?
కలెక్టర్ రామ్ నందన్, మినిష్టర్ మోపీదేవి మధ్య జరిగే కథే గేమ్ ఛేంజర్. కలెక్టర్ గా రామ్ చరణ్ నటిస్తే.. మినిష్టర్ గా ఎస్.జె.సూర్య నటించాడు. సీఎం సత్యమూర్తిగా శ్రీకాంత్ నటించాడు. ఆయన తనయుడే మినిస్టర్ మోపీదేవి. సీఎం చనిపోయే ముందు తన వారసుడుగా కలెక్టర్ రామ్ నందన్ ని ప్రకటించి.. ఆయనే సీఎం అవ్వాలని చెప్పి చనిపోతాడు. అయితే.. మినిష్టర్ మోపీదేవి సీఎం అవ్వాలి అనుకుంటాడు. ఇక ఆతర్వాత నుంచి ఊహించని ట్విస్టులతో అసలు కథ స్టార్ట్ అవుతుంది. సీఎం సత్యమూర్తి కలెక్టర్ రామ్ నందన్ ను సీఎంగా ఎందుకు ప్రకటించాడు..? అసలు రామ్ నందన్ గతం ఏంటి..? రిగ్గింగ్ చేసాయినా ఎన్నికల్లో గెలవాలి..? సీఎం అవ్వాలి అనుకునే మినిష్టర్ మోపీదేవికి కలెక్టర్ రామ్ నందన్ ఎలా బుద్ది చెప్పాడు అనేదే మిగిలిన కథ.
చరణ్ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. అలాగే అంజలి కూడా పాత్రలో లీనమై నటించింది. తన కెరీర్ లో మరచిపోలేని పాత్ర పోషించింది. ఎస్. జె. సూర్య నెగిటివ్ రోల్ లో విలనిజం చూపిస్తూనే అక్కడక్కడా కామెడీ కూడా చేసి నవ్వించాడు. శంకర్ మార్క్ భారీతనం, విజువల్స్ కనిపించాయి కానీ.. ఇంకా ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలిగించింది. సినిమా చూస్తున్నంత సేపు.. ఈ సీన్స్ .. ఈ తరహా కథతో ఎప్పుడో ఏదో సినిమా చూసామనే భావన ప్రేక్షకులకు కలిగించింది. థమన్ మ్యూజిక్ బాగుంది. అయితే.. ఈ మూవీలో హైరానా అంటూ సాగే ఉండాలి కానీ.. మిస్ చేశారు.
కథనాయిక కైరా పాటలకే పరిమితం అయ్యింది తప్పా.. చెప్పుకోదగ్గ పాత్ర కాదు. దిల్ రాజు క్వాలిటీపరంగా ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. అది ప్రతి సీన్ లో స్క్రీన్ పై కనిపిస్తోంది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఓవర్ సీస్ లో రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చాయి. తమిళనాడులో కూడా ఓపెనింగ్ కలెక్షన్ బాగానే ఉంది. బాలీవుడ్ లోను అలాగే కర్నాటక, కేరళలో కూడా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే.. తెలుగుతో ఏ స్థాయి విజయం సాధిస్తుంది అనేది సంక్రాంతికి వచ్చే మిగిలిన రెండు సినిమాల పై ఆధారపడుతుంది. ఫస్ట్ వీక్ ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి మరి.