హైదరాబాద్‌లో డబుల్‌బెడ్ రూం ఇళ్ల పేరుతో ఓ కేటుగాడు అమాయకులను నిండా ముంచాడు. జూబ్లీహిల్స్ నియోజ కవర్గంలోని రహమత్‌నగర్‌కు చెందిన గోవింద్ తనకు ఇల్లు లేకపోవడంతో డబుల్ బెడ్ రూం ఇల్లుపై ఆశపడ్డాడు. ఇదే విషయాన్ని ఇందిరానగర్‌కు చెందిన నర్సింహాకు చెప్పాడు. అయితే, తన పలుకుబడితో డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి బుట్టలోవేసుకున్నాడు. డిమాండ్ చేసినట్టుగా 50 వేల రూపాయలు ఇచ్చాడు. గోవిందే కాకుండా మరో ముగ్గురితోనూ 50 వేల చొప్పున కట్టించాడు. కొన్నాళ్లకు మోసపోయామని తెలుసుకున్న గోవింద్ మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.