హైదరాబాద్ మాదాపూర్ పోలీసులు, నార్కోటిక్ పోలీసులు సంయుక్తంగా రైడ్ చేసి నలుగురు డ్రగ్స్ కన్జ్యూమర్లను పట్టుకున్నట్లు నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్య చెప్పారు. అనంతరం వారి వద్ద నుంచి ఒకటిన్నర కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సచిన్, నవీన్ నాయక్, ప్రణీత్ రెడ్డి, రాహుల్ లపై గతంలోనే కేసులు నమోదు అయ్యాయన్నారు. ఇందులో సచిన్ డ్రగ్ సరఫరా దారుడిగా ఉన్నాడని చెప్పారు. ఇతను మిగతా ముగ్గురికి గంజాయి సప్లై చేస్తాడని తెలిపా రు. మరో డ్రగ్ సరఫరాదారు రాజా పరారీలో ఉన్నట్లు చెప్పారు. అతన్ని త్వరలో పట్టుకుంటా మని ఎస్పీ చెప్పారు.