మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిపై ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షక్షణనిధి విరుచుకుపడ్డారు. ప్రజలకు జగన్ చేసిందేమీ లేదని చెప్పారు. బటన్ నొక్కుడు తప్ప రాష్ట్రానికి జగన్ చేసింది శూన్యం అని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మాజీ ఎమ్మెల్యే విమర్శించారు. జగన్ వల్లే తాను తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయానన్నారు. పవన్ కళ్యాణ్ దమ్మున్న మొనగాడని రక్షణనిధి ప్రశంసించారు. 2023 డిసెంబర్ నుంచి వైసీపీకి తాను దూరంగా ఉన్నట్లు చెప్పారు. ఐ ప్యాక్, సలహాదారులను నమ్మి జగన్ నట్టేట మునిగారని వ్యాఖ్యానించారు. జనం మధ్య తిరిగిన ఎమ్మెల్యేలను జగన్ ఎప్పుడూ గుర్తించలేదని రక్షణనిధి విమర్శించారు.