బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య అవగాహన ఒప్పందంతోనే ఫిరాయింపులు జరుగుతున్నాయని బీజేపీ నేత NVSS ప్రభాకర్ ఆరోపించారు. కేసీఆర్ సలహా, సూచనలతోనే కాంగ్రెస్‌లో చేరుతున్నారని తెలిపారు. కేసుల్లో విచారణ తీవ్రత తగ్గించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మధ్య అవగాహన ఒప్పందం ఉందని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే అనే విషయం ప్రజలకు అర్ధం అయిపోయందన్నారు. ఈ రెండు పార్టీలకు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలోని మెజార్టీ సీట్లను బీజేపీ గెలుచుకోబోతోందని ధీమా వ్యక్తం చేశారు.


