37.2 C
Hyderabad
Saturday, May 2, 2026
spot_img

ముగిసిన చేప మందు పంపిణీ 

స్వతంత్ర వెబ్ డెస్క్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప మందు పంపిణీ ముగిసింది. నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు 2 లక్షల మందికి బత్తిన సోదరులు చేప మందు పంపిణీ చేశారు. ఈరోజు ఉదయానికి చేప మందు పంపిణీ ముగియగా.. కేవలం క్యూ లైన్‌లో ఉన్నవారికి మాత్రమే నిర్వాహకులు చేప మందును పంపిణీ చేస్తున్నారు. ప్రతీసారి ఎక్కువ సంఖ్యలో ప్రజలు చేప మందు కోసం వస్తుంటారు. అయితే ఈసారి ఆశించిన స్థాయిలో ఆస్తమా బాధితులు రాలేదని తెలుస్తోంది. నిన్న(శుక్రవారం) ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేప ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చేప మందు కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉబ్బస వ్యాధిగ్రస్తులు ఒకరోజు ముందే నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానానికి చేరుకున్నారు. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి 10 అర్ధరాత్రి వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీస్ అధికారులు ఆంక్షలు విధించారు. మూడేండ్ల తర్వాత తిరిగి చేపట్టిన చేప ప్రసాదాన్ని స్వీకరించేందుకు పెద్ద ఎత్తున ఉబ్బస వ్యాధిగ్రస్తులు తరలివచ్చారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 32 కౌంటర్ల ద్వారా చేప ప్రసాదాన్ని పంపిణీ చేశారు.

Latest Articles

ట్రంప్‌ ప్రజాదరణ కోల్పోతున్నారా?.. పని తీరుపై ప్యూ సర్వే ఏం చెబుతోంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు, చురుకుదనం , ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వంటి అంశాలపై క్రమంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్