Tirumala | ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల మరో నకిలీ వెబ్ సైట్‌పై ఏఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. టీటీడీ అధికారిక వెబ్ సైట్ తరహలోనే నకిలీ వెబ్ సైట్ మోసగాళ్ళు నిర్వహిస్తున్నారు. టీటీడీ అధికారిక వెబ్ సైట్ http://tirupatibalaji.ap.gov.in కాగా.. http://tirupatibalaji.ap.gov.org అనే వెబ్ సైట్ పేరుతో నకిలీ వెబ్ సైట్ ని నిర్వహిస్తున్నారు కేటుగాళ్ళు. దీనిని గుర్తించిన పోలీసులు.. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటికే 40 వెబ్ సైట్లపై పోలిసులు కేసులు నమోదు చేశారు.