TDP YCP Fight |అనంతపురం క్లాక్ టవర్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో పోలీసు కానిస్టేబుల్ కు తీవ్రగాయాలయ్యాయి. రాప్తాడు నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు క్లాక్ టవర్ వద్దకు రావాలని ఇరు పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో సవాళ్లు విసురుకున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. అయినా కానీ పోలీసు వలయాన్ని చేధించుకుని వైసీపీ మద్దతుదారులు క్లాక్ టవర్ దగ్గరకు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.