స్వతంత్ర టీవీ ఛానల్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఛానల్ ఎండీ కృష్ణ ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నారు. వారి ప్రాణ త్యాగాల ఫలమే ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఛానల్ సిబ్బంది సహా పలువురు పాల్గొన్నారు.