26.7 C
Hyderabad
Saturday, April 26, 2025
spot_img

ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి రాజీనామా ఆమోదం

ఏపీ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ ఎండీ దినేష్‌కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేయడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆ సంస్థ ఛైర్మన్‌ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. జీవీ రెడ్డి ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేయగా దాన్ని సీఎం ఆమోదించారు. ఆ వెంటనే ఎండీ దినేష్‌కుమార్‌కూ స్థానచలనం కల్పించారు.

ఏపీ ఫైబర్‌నెట్‌ ఎండీ దినేష్‌కుమార్, కొందరు అధికారులు రాజద్రోహానికి పాల్పడుతున్నారని జీవీ రెడ్డి ఆరోపించారు. ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కై సంస్థ ఆర్థికమూలాలు దెబ్బతీస్తున్నారని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఛైర్మన్‌గా తాను సంస్కరణలు తీసుకొచ్చినా ఆదాయం పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫైబర్ నెట్‌లో ఉద్యోగుల తొలగింపు, జీఎస్టీ చెల్లింపుల వంటి అంశాలపైనా జీవీ రెడ్డి ఆరోపణలు చేశారు. వైసీపీకి సానుభూతిపరులు అయిన ఉద్యోగులను జీవీ రెడ్డి తొలగించినప్పటికీ ఫైబర్ నెట్‌ ఎండీ ఆమోదం తెలపలేదని ఆగ్రహంగా వ్యక్తం చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లి జీవీ రెడ్డి వివరణ ఇచ్చారు. బహిరంగ ఆరోపణలు చేయడమేంటని జీవీరెడ్డిపై మండిపడ్డారు. ఇకపై గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. ఆ వ్యవహారంలో దినేష్‌కుమార్‌ తప్పిదమూ ఉందని తేలడంతో ఆయననూ మందలించారు. అధికారులతో కలిసి పని చేసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆరోపణలు చేసిన అధికారులతో కలిసి పని చేయడం ఇష్టం లేకపోవడంతోనే రాజీనామా చేశానని జీవీ రెడ్డి తెలిపారు.

Latest Articles

ప్రేమకథల్లో కొత్త కథగా ‘మన ఇద్దరి ప్రేమ కథ’

ఈ శుక్రవారం అర డజనుకు పైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన చిత్రం ఇక్బాల్ దర్శకత్వం వహించిన 'మన ఇద్దరి ప్రేమ కథ'. తనే హీరోగా నటించి, దర్శకత్వం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్