ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్య తెలంగాణ రాజకీయాల్ని కుదిపేస్తోంది. రైతు ఆత్మహత్యకు కాంగ్రెస్ ప్రభుత్వమే కార ణమని ఆరోపిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం బీఆర్‌ఎస్ నేతలే రైతును రెచ్చగొట్టి ఆత్మహత్యకు పురిగొల్పారని ఆరోపి స్తోంది. రైతు ఆత్మహత్య చుట్టూ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటున్నాను అని ప్రభాకర్ అనే రైతు వీడియో విడుదల చేసి ఆత్మ హత్య చేసుకున్నాడు. తన భూమిని కొందరు కబ్జా చేశారని.. పోలీసులకు, అధికారు లకు ఫిర్యాదు చేసిన ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆత్మహత్యకు ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా.. ప్రభాకర్ వీడియోను మరణ వాంగ్మూలంగా స్వీకరించి పోలీసులు కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించాల్సిన పోలీసులు కూడా స్పందించ ట్లేదన్నారు. ఆయన తండ్రి ఫిర్యాదు తీసుకునేందుకు కూడా నిరాకరిస్తున్నారు అని హరీశ్‌రావు తెలిపారు. ప్రభాకర్ ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. రైతు ఆత్మహత్య కు కారకులైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలన్నారు.
ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రైతు ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటి కే ప్రభాకర్ మృతిపై పలువురు మంత్రులు స్పందించి, విచారణ వేగవంతం చేయాలని ఆదేశిం చారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం దీనిపై సీరియస్‌గా స్పందించడంతో పోలీస్ ఉన్నతాధికారులు రంగం లోకి దిగారు. మరోవైపు రైతులు పొలం పంచాయితీలతో ఆత్మహత్య లకు పాల్పడొద్దని, కాంగ్రెస్ పాలనలో అందరికీ న్యాయం జరుగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కాగా ప్రభాకర్ అనే వ్యక్తి బీఆర్‌ఎస్ కార్యకర్త అని కాంగ్రెస్ సీనియర్ నేత కొదండ రెడ్డి ఆరోపించారు. ఆయనతో ఉద్దేశ పూర్వకం గానే బీఆర్‌ఎస్ నేతలు వీడియో చేయించారని ఆరోపించారు. ప్రభాకర్‌ను ప్రోత్సహించి విషం తాగించా రని తెలిపారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటుందన్నారు. బీఆర్‌ఎస్ నేతలే ప్రభాకర్‌ను ప్రోత్స హించి ఆత్మహత్యకు పురిగొల్పినట్లు స్పష్టమైందన్నారు.