సొసైటీ అధికారుల తీరుతో రైతుల ఆందోళన బాట పట్టిన సంఘటన..వరంగల్ జిల్లా చింతలపల్లిలో చోటుచేసుకుంది. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘంలో 644 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. సొసైటీ నిర్వాహకుల తీరుతో సభ్యులుగా ఉన్న రైతులకు రుణమాఫీ కాలేదు. దీంతో వారిపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోర్జరీ సంతకాలతో నిధులు దారిమళ్లిస్తూ తమ నిండా ముంచుతున్నారని వాపోయారు. రుణమాఫీ కావాల్సిన కోట్ల రూపాయల ధనం సొసైటీ నిర్వాహకులు, బ్యాంకర్ల నిర్వాహం వల్ల మాఫీ కాక తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు జరిగిన అన్యాయంపై బ్యాంకు అధికారులు, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగిన లాభం లేకుండా పోయిందని ఆవేదన చెందారు. ప్రభుత్వం స్పందించింది రుణమాఫీ విషయంలో తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు. అలాగే అవినీతికి పాల్పడిన సొసైటీ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.