Visakha Steel Plant | విశాఖ స్టీల్ ప్లాంట్ ఈఓఐ బిడ్డింగ్ గడువు ముగిసింది. తెలంగాణకు చెందిన సింగరేణి సంస్థ బిడ్ దాఖలు చేయలేదు. ఇటీవలే విశాఖలో సింగరేణి కాలరీస్ అధికారుల బృందం పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో సాధ్యాసాధ్యాలపై వారు ఆరా తీశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు నివేదిక కూడా అందజేశారు. అన్ని పరిశీలించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ కు దూరంగా ఉంది. ఈఓఐ గడువు ఐదు రోజులు పెంచినా బిడ్డింగ్ కు పెద్ద స్పందన కనిపించలేదు. మొత్తం 22 కంపెనీలు బిడ్ దాఖలు చేసినట్లు సమాచారం. విశాఖ స్టీల్ కోసం 6 అంతర్జాతీయ సంస్థలు బిడ్డింగ్ లో పాల్గొన్నాయి. క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సమీకరించే ప్లాన్ తో స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ కూడా పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ లో పాల్గొనడం లేదు అనే వార్తలకు సంబంధించి ఇటీవల ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య పెద్ద మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే.