SV యూనివర్సిటీ సెనేట్ హాల్‌లో తిరుపతి డిప్యూటి మేయర్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. నిన్న జరగాల్సిన ఈ కార్యక్రమం ఉద్రిక్తల నేపథ్యంలో ఇవాళ్టికి వాయిదా పడింది. తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక రణరంగంగా మారింది. బెదిరింపులు, దాడులు, కిడ్నాప్‌ల మధ్య కోరం లేక నేటికి వాయిదా పడింది.
SV యూనివర్సిటీ వేదికగా తిరుపతి నగర డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు చేపట్టారు. అయితే SVU ప్రాంగణంలో కూటమి నేతల దాడితో హైడ్రామా నడిచింది.
మొత్తం 50 డివిజన్‌లలో మొత్తం 46 మంది వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు ఎన్నిక కాగా, 35వ డివిజన్ నుంచి టీడీపీ నుంచి ఒకే ఒక అభ్యర్థి ఆర్సీ మునికృష్ణ ఎన్నికయ్యారు. 24వ డివిజన్‌కు సంబంధించి వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ హనుమంత్ నాయక్ అనారోగ్యంతో మృతి చెందారు. 4వ డివిజన్‌కు భూమన అభినయ్ రెడ్డి రిజైన్ చేశారు. ఈ రెండు డివిజన్ స్థానాలకు ఖాళీ ఏర్పడటంతో.. ఒక డివిజన్‌కు కోర్టు ఆదేశాలలతో ఎన్నికలు నిలిచాయి. మిగిలిన 46 డివిజన్‌లలో వైసీపీ తరపున కార్పొరేటర్లు గతంలో ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి ఒకే ఒక్క కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణ గెలుపొందారు.
డిప్యూటి మేయర్ ఎన్నికల్లో వైసీపీ కార్పొరేటర్లను భయపెడుతున్నారని ఆపార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎక్స్ అఫిషియో హోదాలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం వైసీపీ తరపున ఓటు హక్కు వినియోగించే అవకాశం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యంను టీడీపీ నేతలు అర్ధరాత్రి కిడ్నాప్ చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎక్స్ అఫిషియో హోదాలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం వైసీపీ తరపున ఓటు హక్కు వినియోగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యంను టీడీపీ నేతలు.. అర్థరాత్రి కిడ్నాప్ చేశారు.
తిరుపతి రాయల్ చెరువు రోడ్డులో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి డ్రైవర్‌ను టీడీపీ శ్రేణులు చితకబాదారు. ఈ క్రమంలో రెండు కార్లను ధ్వంసం చేశారు. మరోవైపు వైసీపీ కార్పొరేటర్లకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.