నెల్లూరు రుచులకు దేశ, విదేశాల్లో మంచి అభిమానులు ఉన్నారని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తాను అమెరికా వెళ్లినా నెల్లూరు జిల్లా నుంచే చింతకాయ పచ్చడి తీసుకువెళతానని చెప్పారు. నెల్లూరు జిల్లా గూడూరులో దువ్వూరు రమణమ్మ మహిళా కాలేజిలో శ్యామసుందర్‌రెడ్డి, డాక్టర్ సీఆర్‌రెడ్డి విగ్రహాలను వెంకయ్య నాయుడు ఆవిష్కరించాకె. సీఆర్‌రెడ్డి జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. మహిళల కోసమే ఒక కాలేజి ఏర్పాటు చేయాలని ఆనాడు ఆలోచన రావడం గొప్పవిషయం అన్నారు. నాగరికత, టెక్నాలజీ అభివృద్ధి చెందినా కొన్ని ప్రాంతాలలో ఇంకా లింగ వివక్ష ఉందని వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. చిన్న పిల్లలపై ఇప్పటికీ అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.


