స్వతంత్ర వెబ్ డెస్క్: ఇప్పటిదాకా చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే..త్వరలో ప్రతిపక్షాలకు బిఆర్ఎస్ పార్టీ(BRS Party) సినిమా చూపించబోతుందని మంత్రి కేటీఆర్(Minister KTR) నేడు స్టీల్ బ్రిడ్జి(Steel Bridge) ప్రారంభం సందర్బంగా అన్నారు. ఈ క్రమంలో స్పందించిన హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(MLA Etala Rajender) కేటీఆర్(KTR)కు కౌంటర్ ఇచ్చారు. ఇప్పటిదాకా చూసింది కేవలం టైలర్ మాత్రమే..త్వరలో ప్రతిపక్షాలకు బిఆర్ఎస్ పార్టీ సినిమా చూపించబోతుందని మంత్రి కేటీఆర్ నేడు స్టీల్ బ్రిడ్జి ప్రారంభం సందర్బంగా అన్నారు.
ఈ క్రమంలో స్పందించిన హుజురాబాద్ బీజేపీ(BJP) ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. సినిమా చూయించిన, ట్రైలర్ చూయించిన..చూయించేది నాయకులు కాదు ప్రజలు. రేపు ఎన్నికలు వచ్చినప్పుడు సినిమా చూడాల్సింది బి.ఆర్.యస్ నాయకులు..చూపించేది ప్రజలు అని గుర్తు చేశారు. ఇక్కడ సినిమా చూడాల్సింది బీఆర్ఎస్ నేతలైతే చూపించేది ప్రజలని, తమకు రాష్ట్ర ప్రజలపై పూర్తి నమ్మకం ఉందన్నారు.
కాగా రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలో పార్టీలన్నీ కూడా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటే తమ పార్టీనే అధికారం చేపడుతుందని సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు. ఈ క్రమంలో ఒకరు చేసిన వ్యాఖ్యలకు మరో పార్టీ నేత కౌంటర్ ఇస్తూ దూసుకెళ్తున్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఈటల తీవ్ర స్థాయిలో స్పందించారు.