26.2 C
Hyderabad
Friday, December 27, 2024
spot_img

నవంబర్ 1 వరకు వైఎస్ భాస్కరరెడ్డికి ఎస్కార్ట్ బెయిల్ పొడిగింపు

స్వతంత్ర వెబ్ డెస్క్: వివేకానందారెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా చంచల్ గూడ జైలులో చాలా రోజులు ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఎస్కార్ట్ బెయిల్‌పై బయట ఉన్నారు. అయితే.. తాజాగా వైఎస్ భాస్కర రెడ్డికి ఎస్కార్ట్ బెయిల్‌ను సీబీఐ న్యాయస్థానం పొడిగించింది. తన బెయిల్ పిటిషన్ పొడిగించాలని ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నట్లు కోర్టుకు విన్నవించారు. వైద్యుల సూచన, తదుపరి చికిత్స కోసం తనకు ఇచ్చిన ఎస్కార్ట్ బెయిల్‌ను మరో రెండు నెలలు పొడిగించాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిని విచారించిన న్యాయస్థానం నవంబర్ 1 వరకు ఎస్కార్ట్ బెయిల్‌ను పొడిగించింది.
ఎస్కార్ట్ బెయిల్లో భాగంగా ముగ్గురు పోలీసులు, ఒక పోలీస్ వెహికిల్ ఉంటాయి. ఎస్కార్ట్ బెయిల్లో వీళ్లు భాస్కర్ రెడ్డి వెంటే ఉంటారు. ఇదిలా ఉంటే వివేకా హత్య కేసులో.. ఈ ఏప్రిల్‌లో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని పులివెందులలో విచారించి.. నాటకీయ పరిణామాలు నడుమ అదుపులోకి తీసుకున్నారు తెలంగాణ సీబీఐ అధికారులు. అప్పటి నుంచి ఆయన చంచల్ గూడ జైల్లో ఉన్నారు. మధ్యంతర బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్ వేయగా.. గత నెల 20న ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. అంతకు ముందు ఉదయ్ కుమార్ రెడ్డికి కూడా సీబీఐ కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఉదయ్ భార్య గర్భవతిగా ఉండడంతో ఆమెను కలిసేందుకు 14 నుంచి 16వ తేదీ వరకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది.

Latest Articles

శ్రీశైలంలో మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

శ్రీశైలంలో మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలంగాణ భక్తుల విన్నపాలపై ఏపీ ప్రభుత్వం తమ విజ్ఞప్తిని పరిష్కరిస్తుందని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్