Sai Pallavi |ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ లుక్ తో తెరకెక్కిన ‘పుష్ప’ మూవీ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. 2021 డిసెంబర్‌లో రిలీజ్ అయింది. బాక్సాఫీస్ దగ్గర 400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అల్లుఅర్జున్(Allu Arjun)కు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తీసుకువచ్చింది. ఒక్క బాలీవుడ్ లోనే 100 కోట్ల నెట్ సాధించి అక్కడి క్రిటిక్స్ ను కూడా ఆకర్షించింది. అయితే ఈ సినిమాకు సీక్వల్ గా తీయనున్న ‘పుష్ప -2’ కు సంబంధించి మరో రూమర్ చక్కర్లు కొడుతుంది.
పుష్ప సీక్వెల్ సినిమాలో సాయిపల్లవి(Sai Pallavi) కీలకపాత్రలో నటిస్తున్నట్టు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతుంది. ఓ గిరిజన అమ్మాయి పాత్ర కోసం సాయిపల్లవిని పుష్ప మేకర్స్ సంప్రదించినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే ఈ పాత్ర కోసం సాయి పల్లవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే.. ఈ సినిమా కోసం సాయిపల్లవి 10 రోజులు కాల్షీట్లు కూడా ఇచ్చిందట. మరి ఈ విషయం ఎంతవరకు నిజం అనేది అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తే కానీ చెప్పలేం.
Read Also: ‘ప్రాజెక్ట్ K’ లో భారీ పారితోషికం అందుకుంటున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ.. ఎంతంటే?
Follow us on: Youtube Instagram