రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఓ ఇంజినీర్ దారుణ హత్య కలకలం రేపింది. ఇజాయత్ అలీ అనే ఇంజినీర్ ను దుండగులు అతి దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. ఇద్దరు కాళ్లు పట్టుకోగా, ఒకరు కత్తితో గొంతు కోసి పరారయ్యారు. దుబాయ్‌లో ఇంజనీర్‌గా పని చేస్తున్న ఇజాయత్ అలీ గత 20రోజుల క్రితం ఇండియాకు వచ్చాడు. హత్య అనంతరం క్వాలిస్ వాహనాన్ని అక్కడే విడిచిపెట్టి పారిపోయారు. సమాచా రం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుల వాహనాన్ని, రెండు ఫోన్లను సీజ్ చేశారు. ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.


