స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ – ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. చర్ల మండలం పుట్టపాడు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. సంఘటన స్థలంలో పోలీసులు ఒక ఎస్ఎల్ఆర్ ఆయుధం స్వాధీనం చేసుకున్నారు.


