31.2 C
Hyderabad
Sunday, May 26, 2024
spot_img

పార్టీ అకౌంట్లో పడ్డ ఎల‌క్టోర‌ల్ బాండ్లు…..?

   దేశంలో రాజకీయ పార్టీలకు ఇచ్చే నిధుల పరంగా ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థ టాప్ స్థానంలో నిలిచింది. ఈ సంస్థ పలురాష్ట్రాల్లో లాటరీలను నిర్వహిస్తోంది. అయితే లాటరీలు, క్యాసినోలు నిషే ధించబడిన ఏపీని పాలిస్తున్న వైసీపీకి ఈ కంపెనీ పెద్ద మొత్తం విరాళం ఇచ్చింది. దాదాపు 149 కోట్లు ఆ పార్టీ అకౌంట్లో పడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వడం వెనుక ఉన్న కారణాలేంటి..?

  కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఎల‌క్టోర‌ల్ బాండ్ల‌ సమాచారం దేశరాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎస్బీఐ వ‌ద్ద బాండ్లు కొన్న సంస్థ‌లు స‌మాచారం ఇందులో ఉంది. అయితే కోయంబ‌త్తూరుకు చెందిన ఫ్యూచ‌ర్ గేమింగ్ సంస్థ అత్య‌ధికంగా ఎల‌క్టోర‌ల్ బాండ్ల‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఎల‌క్టోర‌ల్ బాండ్ల రూపంలో ఫ్యూచ‌ర్ గేమింగ్ అండ్ హోట‌ల్ స‌ర్వీసెస్ సంస్థ సుమారు 1368 కోట్లు విరాళం ఇచ్చినట్లు సమాచారం. వివిధ రాజ‌కీయ పార్టీల‌కు ఆ బాండ్లు ద‌క్కిన‌ట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 12, 2019 నుంచి జ‌న‌వ‌రి 24, 2024 వ‌ర‌కు ఆ బాండ్ల‌ను ఖ‌రీదు చేశారు.

1991 సంవత్సరంలో మార్టిన్ లాటరీ ఏజెన్సీస్ లిమిటెడ్ ద్వారా ఈ కంపెనీ ప్రారంభించబడింది. ఇది భారత్‌లో లాటరీ కింగ్ అని పిలువబడే శాంటియాగో మార్టిన్ యాజమాన్యంలో ఉంది. అయితే శాంటియాగో అధ్వర్యంలో మార్టిన్ ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సహా మరొకొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పలు పార్టీలకు ఎలక్ట్రోల్ బాండ్ ల రూపంలో వేల కోట్ల రూపాయల విరాళాలిచ్చినట్లు తెలుస్తోంది. లాటరీలు చట్టబద్దమైన రాష్ట్రాల్లో ప్రభుత్వంలో ఉన్న పార్టీలకు విరాళాలి చ్చిందంటే అర్దం చేసుకోవచ్చు కానీ లాటరీ నిషేధించబడిన ఏపీని పాలిస్తున్న వైసీపీకి ఈ కంపెనీ పెద్ద మొత్తం విరాళం ఎందుకు ఇచ్చిందనే హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో, అధికార పార్టీ వైసీపీకి ఈ కంపెనీ 149 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చినట్లు సమాచారం. 89కోట్ల రూపాయల విలువైన మొదటి బ్యాచ్ బాండ్‌లను అక్టోబర్ 27,2020న కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత‌ 60 కోట్ల రూపాయలను ఏప్రిల్ 7,2021న కొను గోలు చేసినట్లు తెలుస్తోంది. ఆ వెంటనే జగన్ ప్రభుత్వం, రాష్ట్రంలో లాటరీలు , క్యాసినోలపై నిషేధాన్ని ఎత్తి వేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చాయి.

2020-21లో ప్రభుత్వం లాటరీ, క్యాసినోలను అనుమతించే సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఇద్దరు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలతో కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. దేశంలో 13 రాష్ట్రాల్లో చట్టబద్ధమైన లాటరీ విధానం ఎలా పనిచేస్తుందో కమిటీ పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి. ఈ కమిటీ కేరళ మోడల్‌ను నిశితంగా అధ్యయనం చేసిందని.. ప్రభుత్వం లాటరీ విధానాన్ని ప్రారంభించినట్ల యితే వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుందనే అంచనాకు వచ్చినట్లు తెలిసింది.అదే సమయంలో విశాఖ తీరంలో క్యాసినోలకు అనుమతి ఇచ్చే అంశాన్ని కూడా కమిటీ పరిశీలించినట్లు తెలుస్తోంది. దీనివల్ల ప్రభుత్వానికి ఏడాదికి 11,000 కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరుతుందని కమిటీ అంచనా వేసిన ట్లు చెబుతున్నారు.

ఈ కమిటీ 2020లో చర్చలను ప్రారంభించి, 2021 మధ్య నాటికి తన నివేదికను సమర్పించిందని ఏపీ ప్రభుత్వం తో కలిసి పనిచేసిన వ్యక్తి ధృవీకరించారు. అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే క్యాసినోలు, లాటరీలను అను మతించడం వల్ల అధికార పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని, సీఎం జగన్‌కు ప్రత్యేకించి మహిళా ఓటర్ల నుంచి భారీ ఎదురుదెబ్బ తగులుతుందని నివేదిక తేల్చినట్లు తెలుస్తోంది. దాంతో ఈ ప్రతిపాదన బుట్టదాఖ లైనట్లు చెబుతున్నారు. కానీ శాంటియాగో ఇచ్చిన 149 కోట్ల రూపాయలు వైసీపీ ఖాతాలో పడినట్లు తెలుస్తోంది.

Latest Articles

ముంచుకొస్తున్న రెమాల్ తుఫాన్

రెమాల్ తుఫాను దూసుకొస్తోంది. బెంగాల్‌, అస్సోం, మేఘాలయలో రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు అధికారులు. తుఫాను కారణంలో కోల్‌కతా ఎయిర్‌పోర్టు మూసివేసి, విమాన రాకపోకలు నిలిపివేస్తు న్నారు. బంగాళాఖాతంలో రెమాల్‌ తుఫాన్‌ బలపడింది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్