Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

తొలిదశలో 102 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు

సార్వత్రిక ఎన్నికలకు దేశం సిద్ధమైపోయింది. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి అగ్నిపరీక్షగా భావిస్తున్న లోక్ సభ ఎన్నికలు ఏడు విడతల్లో జరుగుతాయి. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం హోరందుకుంది. లోక్ సభ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ ఏప్రిల్ 19న జరుగు తుంది. తొలిదశలో దాదాపు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 102 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. మార్చి 27నే నామినేషన్ల పర్వం మొదలైంది. మండు టెండలో తొలిదశకు సిద్ధమవుతున్న స్థానాలకు సంబంధించిన వివరాల్లోకి వెళదాం.

ఒక పక్క మండు టెండలు… మరో పక్క వివిధ రాజకీయ పార్టీల వాడి వేడి విమర్శలతో దేశంలో ఎన్నికల హీట్ హెచ్చింది. తొలిదశలో మొత్తం 102 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే.. తమిళనాడులో మొత్తం 39 స్థానాలకు తొలిదశలో ఎన్నికలు పూర్తవుతాయి. పాండిచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, జమ్మూకశ్మీర్ లో ఒక స్థానానికి ఈ దశలో ఎన్నిక జరుగుతుంది. అసోం, అరుణాచల్ ప్రదేశ్ లో రెండేసి స్థానాలకు, చత్తీస్ గఢ్ లో ఒక స్థానానికి, మధ్యప్రదేశ్ లో ఆరు స్థానాలకు, మహారాష్ట్రలో ఐదు స్థానాలకు, బీహార్ లో 4 స్థానాలకు మణిపూర్, మేఘాలయలో రెండు స్థానాలకు, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపురలో ఒక్కో స్థానానికి రాజస్థాన్ లో 12 స్థానాలకు, ఉత్తరప్రదేశ్ లో 8, ఉత్తరాఖండ్ లో 5 పశ్చిమ బెంగాల్ లో 3 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలలో మొత్తం ఏడు దశలలోనూ.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ జరగడం విశేషం.

దక్షిణాది రాష్ట్రాలోని కీలకమైన తమిళనాడులో తొలిదశలోనే ఏప్రిల్ 19న మొత్తం 39 స్థానాలకు ఎన్నికలు జరుగుతు న్నాయి. పూర్తిగా అన్ని ఎంపీస్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం తమిళ నాడు. తమిళనాడులో ఆరు దశాబ్దాలుగా ద్రవిడియన్ పార్టీలదే రాజ్యం. అక్కడ డిఎంకె, ఏఐఏడిఎంకె ప్రధాన పార్టీలుగా ఉంటూ వచ్చాయి. కాంగ్రెస్ డిఎంకే కూటమితో పొత్తు కారణంగా కొంత మెరుగైన ఫలితాలు సాధిస్తున్నా, మిగతా జాతీయ పార్టీల పరిస్థితి నామ్ కే వాస్తే.. అన్నట్లే ఉంది. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులో మూడు కూటములు పోటీ పడుతున్నాయి. మూడేళ్ల క్రితం డీఎంకే ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అధికార డీఎంకే 21 సీట్లలో పోటీ చేస్తోంది. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు తొమ్మిది సీట్లు, మిగతా చిన్నచిన్న రాజకీయపార్టీలకు ఒక్కో సీటు కేటాయించారు.

జయలలిత మరణానంతరం ఏఐఏడిఎంకె లో చీలికలు వచ్చాయి. పన్నీర్ సెల్వం, పళనిసామి మధ్య విభేదాలతో పార్టీ రెండు గా చీలింది. ప్రస్తుతం ఎరపాటి పళనిస్వామి పార్టీకే అధికార ఏఐఏడిఎంకె గుర్తింపు లభించింది. పళనిస్వామి నాయకత్వంలోని అన్నా డీఎంకే విజయ్‌కాంత్ పార్టీ డీఎండీకేతో జత కట్టింది. పళని స్వామి పార్టీ మెజారిటీసీట్లకు పోటీచేస్తోంది. డీఎండీకే కు ఐదు సీట్లు ఇవ్వడానికి పళనిస్వామి అంగీకరించారు. అలాగే ఎస్డీపీఐ, పుదియ తమిళగం పార్టీలకు ఒక్కో సీటు కేటాయించారు పళనిస్వామి. ఎన్డీఏ తరుపున బీజేపీ 19 స్థానాలకు పోటీ చేస్తుండగా అన్బుమణి పట్టాళి మక్కళ్ మున్నేట్ర కజగం 10 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగతా స్థానాలను చిన్న పార్టీలకు ఒకటి రెండు సీట్ల చొప్పున కేటాయించారు. ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో కనీసం కొన్ని స్థానాలైనా గెలవాలన్నదే బీజేపీ లక్ష్యం. ఇప్పటికే తమిళనాడులో ప్రధాని మోదీ ప్రచారం హోరెత్తించారు. తూత్తుకుడి లో భారీ సభ జరిపి.. వరాలు ప్రకటించారు. 1974లో కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ శ్రీలంక ప్రధాని సిరిమావో బండారు నాయకేతో ఒప్పందం కుదుర్చుకుని కచ్చితీవు దీవిని ఆ దేశానికి ధారాదత్తం చేశారనే అంశాన్ని మోదీ ప్రచారాస్త్రంగా మరల్చుకున్నారు. 50 ఏళ్లనాటి ఒప్పందాన్ని తిరగదోడడం సాధ్యం కాకపోయినా.. కాంగ్రెస్ – డిఎంకె ను టార్గెట్ చేసి ఓట్ల లబ్ధి పొందుదామని చూస్తున్నారు.

తొలిదశలో రాజస్థాన్ లో 12స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. గంగానగర్, బికనీర్, చారు, ఝుంజును, శికర్, జైపూర్ , జైపూర్ రూరల్, అల్వార్, భరత్ పూర్, కరౌలి- ధోల్ పూర్, దౌసా, నాగౌర్ స్థానాల్లో తొలిదశ పోలింగ్ ఏప్రిల్ 19న జరుగుతుంది. ఇప్పటికే 40 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అధికార బీజేపీ రాజస్థాన్ లో ఈ సారి మెజారిటీ సీట్లు గెలుచుకుంటామనే ధీమాతో సాగుతోంది. రాజస్థాన్ ఎడారికి ప్రసిద్ధి. ఎండలు మండిపోతున్నాయి. మండు టెండలో కూడా అభ్యర్థులు ప్రచారం మోత మోగుతోంది. ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోచూడాలి.

     ఉత్తరప్రదేశ్ అనగానే గుర్తుకువచ్చేది బీజేపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ప్రధాని నరేంద్రమోదీ, యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో బీజేపీ యూపీలోని మొత్తం 80స్థానాలనూ గెలుచుకోవాలని లక్ష్యంగా సాగుతోం ది. ఆయోధ్యలో రామ జన్మభూమి మందిరం నిర్మాణం, బాలరాముడి ప్రతిష్టతో పెరిగిన సెంటిమెంట్ ను ఓట్లుగా మరల్చుకోవాలనే లక్ష్యంతో సాగుతోంది. తొలిదశలో ఏప్రిల్ 19న 8 స్థానాల్లో ఎన్నికలు జరుగుతు న్నాయి. వాటిలో సహరన్‌పూర్, కైరానా, ముజఫర్‌నగర్‌, బిజ్నూర్‌, నగీనా, రాంపూర్‌, పిల్‌భిత్ నియోజక వర్గాలున్నాయి. బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమికి, సమాజ్ వాదీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి డైరెక్ట్ ఫైట్ ఈ లోక్ సభ ఎన్నికలు ..సమాజ్ వాదీ పార్టీ అత్యధికంగా 61 స్థానాల్లో పోటీచేస్తోంది. బహుజన సమాజ్ పార్టీకి చెందిన మాయావతి అటు ఎన్డీఏ తో కానీ, ఇటు ఇండియా కూటమితో కానీ కలవకుండా ఒంటరిగా పోటీ చేస్తోంది.

మహారాష్ట్రలో కేంద్రమంత్రి నితిశ్ గడ్కరీ లోక్ సభ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలిదశలో నాగపూర్, రామ్ టేక్, చంద్రపూర్, గడ్చిరోలి- చిమ్మూర్ . గోండియా- భండరా నియోజకవర్గా లకు ఎన్నికలు జరుగు తాయి. ఈ నియోజకవర్గాలన్నీ విదర్భ రీజియన్ లో ఉండడం విశేషం. బీహార్ లో నాలుగు స్థానాల్లో తొలిదశలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్డీఏలో జేడీయూ చేరడంతో బీహార్ లో ప్రస్తుతం బీజేపీ, జేడీయూ కలిసి పోటీ చేస్తుండగా, ఆర్జేడీ, కాంగ్రెస్, మహా ఘట్ బంధన్ పేరుతో పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏడు దశల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్