ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ మెస్‌లో అపరిశుభ్రత, విద్యార్థుల అనారోగ్యంపై స్వతంత్ర టీవీ కథనాలపై పోలీసులు స్పందించారు. నూజివీడు ట్రిపుల్ ఐటి మెస్ కాంట్రాక్టర్లను నూజివీడు పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రిపుల్ ఐటీ ఏఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశారు. విద్యార్థుల అనారోగ్యానికి కారణం మెస్ యాజమాన్యం ఆహారం పరిశుభ్రంగా ఉండడం లేదని మెడికల్ ఆఫీసర్ అన్నారు. మెస్‌లో సుమారు వెయ్యి మంది అనారోగ్యానికి కారణం మంచి ఆహారం పెట్టకపోవడమే అని విచారణలో మెడికల్ ఆఫీసర్ తెలిపారు. ఫైన్ కేటరర్స్ అండ్ సప్లయర్స్, అనూష హాస్పిటాలిటీ సర్వీసెస్ యాజమాన్యంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు.