బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్‌కు ఈడీ మరోసారి నోటీసులు జారీచేసింది. ఈనెల 16న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఇప్పటికే కేటీఆర్‌కు ఒకసారి నోటీసులు ఇచ్చింది. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై విచారణ ఉందని.. కేటీఆర్ గడువు కోరారు. తాజాగా ఆయన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ క్రమంలో ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే వాదనలు ముగియగా.. మంగళవారం కేటీఆర్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఇలాంటి పిటిషన్లలో కుదరదని తెలిపింది.