35.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

లిక్కర్ స్కాం తాజా ఛార్జ్ షీట్‌లో సంచలన అంశాలు

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో దూకుడుగా వ్యవహరిస్తున్న ఈడీ అధికారులు తాజాగా మూడో ఛార్జీషీట్ రౌస్ ఎవెన్యూ కోర్టులో దాఖలు చేశారు. ఈ ఛార్జీషీట్ లో సంచలన అభియోగాలు నమోదుచేసింది. లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహరించిందని పేర్కొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ రెడ్డిపై కీలక అభియోగాలు మోపింది.

ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన అరుణ్ పిళ్లై లిక్కర్ స్కాంలో కవిత తరపున ప్రతినిధిగా వ్యవహరించారని తెలిపింది. కవితతో పాటు ఆయన భర్త అనిల్ పేరును ఛార్జీషీట్ లో పేర్కొనడం చర్చనీయాంశమైంది. దాదాపు రూ.100కోట్ల ముడుపులకు సంబంధించిన ఆధారాలు దొరికాయని ఈడీ పేర్కొంది. హవాలా, ముడుపులు, భూముల కొనుగోళ్ల అంశాన్ని ప్రస్తావించింది. నిందితుల లావాదేవిలకు సంబంధించిన వాట్సాప్ చాట్స్, ఈమెయిల్స్ ను ఛార్జీషీట్ లో జతచేసింది.

Latest Articles

మీ దగ్గర మ్యాజిక్ నంబర్ లేదుగా.. విజయ్‌కు గవర్నర్‌ షాక్‌

తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన విజయాన్ని సాధించిన సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుండగా…...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్