తెలంగాణలో గొర్రెల పంపిణీ అవకతవకలపై ఈడీ దూకుడు పెంచింది. పశువర్ధక శాఖ కార్యాలయంలో ఈడీ సోదాలు చేస్తోంది. ఇప్పటికే ఏసీబీ నమోదు చేసిన కేసుపై ఈడీ ఆరా తీస్తోంది. గొర్రెల పంపిణీ అవకతవకలపై వివరాలు ఇవ్వాలని ఈడీ లేఖ రాసింది.తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలో అక్రమాలపై ఈడీ ఫోకస్ పెట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం క్రింద దీనిపై విచారణ చేపట్టనున్నామని రాష్ట్ర పశుసంవర్దక శాఖకు ఈడీ జోనల్ ఆఫీసు నుంచి నోటీసులు ఇచ్చింది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఈడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.


