కువైట్‌లోని అల్ మంగాఫ్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 49 మంది కార్మికులు మరణించగా వారిలో 45 మందిని భారతీయులుగా గుర్తించారు. ఇప్పుడు ఆ మృతదేహాలను వాయుసేన విమానంలో కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. మృతదేహాలను విమానం నుంచి తరలించారు.విమానం భారత్‌కు చేరుకుంటుం దన్న సమాచారంతో బాధిత కుటుంబాలు ఎయిర్ పోర్టుకు వచ్చాయి. దాంతో ఆ ప్రాంతమంతా ఉద్విగ్నంగా మారిపో యింది. అలాగే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్రమంత్రి సురేశ్ గోపి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేం ద్రన్‌తో పాటు పలువురు విమానాశ్రయంలో ఉన్నారు.
కువైట్‌లోని అల్ మంగాఫ్‌లో రెండు రోజుల కిందట జరిగిన అగ్ని ప్రమాదంలో 49 మంది కార్మికులు మరణించారు. మరణించిన వారిలో 45 మందిని భారతీయులుగా గుర్తించారు. వారిలో ముగ్గురు తెలుగువారు, 24 మంది కేరళ వాసులు, ఏడుగురు తమిళనాడుకు చెందినవారు. మిగిలిన వారు ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారని తెలుస్తోంది. మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5లక్షల చొప్పున పరిహారం అందించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. కువైట్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురున్నారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్ర గ్రామానికి చెందిన తామాడ లోకనాథ, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లికి చెందిన సత్యనారాయణ, అన్నవరప్పాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు ఉన్నారు. వీరి మృతదేహాలు కొచ్చికి చేరాయి. అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.లోకనాథం మంగళవా రం రాత్రి కువైట్‌లోని అపార్ట్‌మెంటు వద్దకు చేరుకున్నారు. తెల్లవారితే పనిలో చేరే అవకాశం ఉండగా.. ఈలోపు అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం ఆయనకు ఫోన్ చేయగా స్విచాఫ్ రావడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఆయన విమాన టికెట్, ఇతర వివరాలతో కంపెనీలో వాకబు చేయడంతో మరణించిన విషయం తెలిసింది.