ఏపీ CS జవహర్ రెడ్డి, DGP హరీశ్ కుమార్ గుప్తా ఢిల్లీకి బయల్దేరారు. మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం కార్యాల యానికి వెళ్తారు. ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వివరణ ఇవ్వనున్నారు. పోలింగ్ సమయంలో పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసపై నివేదిక సమర్పిస్తారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలను అరికట్టేందుకు తీసుకున్న చర్యలు, 144 సెక్షన్, పోలీసు బలగాల మోహరింపుపై కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వనున్నారు. గొడవలకు కారణ మేంటి ఎవరిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి.. ఎంతమందిని అరెస్టు చేశారు. వంటి ప్రశ్నలకు నివేదిక ఇవ్వనున్నారు.
ఏపీలో ఎన్నికల రోజు ఆ తర్వాత జరుగుతున్న హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. హింసా కాండను అరికట్టడంలో విఫలమైనందుకు ఏపీ సీఎస్, డీజీపీపై మండిపడింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ఢిల్లీకి వచ్చి కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.ఎన్నికల్లో హింసకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పదే పదే హెచ్చరించినా ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. ఏపీలో జరుగుతు న్న హింసాకాండపై మీడియాలో వస్తున్న వార్తలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఎన్నికల అనంతరం హింసా కాండ జరుగు తుందని ఎందుకు పసిగట్టలేదు. ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదని ప్రశ్నించింది. ఇది ఎవరి వైఫల్యం. ఎవరిని టార్గెట్ చేసుకుని దాడులు జరుగుతున్నాయి. ఎవరు దాడులు చేస్తు న్నారని ప్రశ్నించింది. ఎటువంటి నివారణ చర్యలు చేపట్టారని.. వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం నోటీసుల అనంతరం సీఎస్ జవహార్ రెడ్డితో డీజీపీ హరీశ్ గుప్తా భేటీ అయ్యారు. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసాకాండపై చర్చించారు. ఇవాళ ఢిల్లీలో ఇవ్వాల్సిన వివరణపైనా చర్చించారు. ఈసీకి ఇవ్వాల్సిన నివేదికపైనా చర్చించారు.