అమెరికాలో హైస్కూల్ ఎడ్యుకేషన్ చేసే కొత్తలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నానని నటి ప్రియాంకా చోప్రా వెల్లడించారు. ఎడ్యుకేషన్ ప్రారంభంలో అక్కడివారితో ఎలా ఉండాలలో తెలియదని.. అందరితో కలిసే దానిని కాదని అన్నారు. కనీసం క్యాంటిన్ కి వెళ్లి ఫుడ్ ఎలా తీసుకోవాలో కూడా అప్పట్లో నాకు తెలియదన్నారు. కాస్త భయపడుతూ వెండింగ్ మిషన్ నుంచి స్నాక్స్ తీసుకొని ఎవరూ చూడకుండా వెళ్లి బాత్రూమ్లోకి వెళ్లి గబగబా తినేసి క్లాస్‌రూమ్‌లోకి వెళ్లిపోయేదాన్నని అన్నారు. నాకున్న భయం వల్ల ఎవరితో కలువలేదన్నారు. అక్కడివారిని నాలుగు వారాలు గమనించి కాస్త దైర్యం పెరిగాక ఫ్రెండ్ షిప్ చేసుకొని.. వాళ్ళతో కలిసిపోయానని తెలిపారు. ఇటీవలే ప్రియాంక నటించిన ‘సిటడెల్’ వెబ్‌సిరీస్ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాల్ని వివరించారు.