24.7 C
Hyderabad
Wednesday, October 15, 2025
spot_img

ఈ-రిక్షా బ్యాటరీ పేలి ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఈ-రిక్షా బ్యాటరీ పేలి ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి చెందిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలో జరిగింది. బారాబంకీ బీబీడీ పోలీస్ స్టేషన్​ పరిధిలో ఉంటున్న అంకిత్ కుమార్​ గోస్వామికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరు అక్కడే తన కోడలితో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ప్రతిరోజు ఈ రిక్షా నడుపుతూ జీవన ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో తాను నడుపుకుంటున్న ఈరిక్షా బ్యాటరీకి ఛార్జింగ్​ పెట్టి ఇంటి పనులు చూసుకుంటున్నాడు. దీంతో ఒక్కసారిగా ఈరిక్షా బ్యాటరీ పేలిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించే క్రమంలో ముగ్గురు చిన్నారులు మరణించగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్