26.2 C
Hyderabad
Monday, December 2, 2024
spot_img

ఫుట్ బాల్ నేపథ్యంలో హృద్యమైన ప్రేమకథగా వస్తున్న ‘డ్యూడ్’

యువ కథానాయకుడు తేజ్ నటిస్తున్న ద్విభాషా చిత్రం “డ్యూడ్”. ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ లో సెట్స్ కు వెళ్లనుంది. తెలుగు – కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పనరోమిక్ స్టూడియోస్ పతాకంపై తేజ్ స్వయంగా నిర్మిస్తుండడమే కాకుండా… స్వయంగా కథను అందించి, దర్శకత్వం వహిస్తుండడం విశేషం. తేజ్ ఇంతకుముందు “రామాచారి” అనే కన్నడ హిట్ చిత్రంలో నటించారు. తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం “గాడ్” కూడా త్వరలో మొదలు కానుంది!!

ఇప్పటివరకు కొన్ని వేల ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. కానీ పూర్తి ఫుట్ బాల్ నేపథ్యంలో ఇప్పటివరకు తెలుగు, కన్నడ భాషల్లో సినిమా రాలేదు. అందువల్లే… కర్ణాటకలోని “కిక్ స్టార్ట్” అనే సుప్రసిద్ధ ఫుట్ బాల్ క్లబ్… “డ్యూడ్” చిత్రానికి పూర్తి సహాయసహకారాలు అందిస్తోంది. డిసెంబర్ లో సెట్స్ కు వెళ్లనున్న ఈ చిత్రానికి కన్నడ – మలయాళ భాషల్లో సుపరిచితుడైన ఇమిల్ మొహమ్మద్ సంగీతం సమకూర్చుతుండగా… నాని కెరీర్ కి తిరుగులేని పునాది వేసిన “అలా మొదలైంది” చిత్రానికి ఛాయాగ్రహణం అందించిన ప్రేమ్ కెమెరా బాధ్యతలు నిర్వహించనున్నారు. రాఘవేంద్ర రాజ్ కుమార్, రంగాయన రఘు, విజయ్ చందూర్, సందీప్ మలని ఇతర ముఖ్య పాత్రల్లో… తేజస్ ధనరాజ్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్ – అప్పాజీ, కథ – స్క్రీన్ ప్లే – నిర్మాణం – దర్శకత్వం : తేజ్!!

Latest Articles

ఇక నుంచి మీ కోసం.. మీ వెంటే.. మీ జగన్‌

సంక్రాంతి తర్వాత క్యాడర్‌తోనే తానంటున్న జగన్.. ఎందుకంటే? ఇప్పటికైనా బాస్‌ క్యాడర్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని చర్చించుకుంటున్నారట నేతలు. ఇక నుంచి మీకోసం.. మీ వెంటే.. మీ జగన్‌ అన్న.. అంటూ కొత్త...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్