19.2 C
Hyderabad
Saturday, January 17, 2026
spot_img

జాక్ పాట్ కొట్టిన డొనాల్డ్ ట్రంప్

    అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు అదృష్టం కలిసొచ్చింది. ట్రంప్ మౌలికంగా వ్యాపారవేత్త అనే సంగతి తెలిసిందే. ఆయన అల్లాటప్పా వ్యాపారవేత్త కాదు. అమెరికాలో ట్రంప్ ఏకంగా ఒక వ్యాపార సామ్రాజ్యాన్నే నిర్మించారు. అనేక రంగాల్లో ట్రంప్ పెట్టుబడులు పెట్టారు. ఆయన వ్యాపారాలకు లాభాల కొదవలేదు. ఇదంతా ఎప్పటినుంచో జరుగుతున్నదే. అయితే తాజాగా ఆయన బిజినెస్ ఎంపైర్ మునుపెన్నడూ లేని విధంగా లాభాల బాట పట్టింది.

గత కొన్నేళ్లుగా ఒక బిజినెస్ డీల్‌పై డొనాల్డ్ ట్రంప్ వ్యాపార సామ్రాజ్యం కసరత్తు చేస్తోంది. అయితే చాలా రోజులుగా ఈ డీల్ పెండింగ్‌ లో పడింది. ఒక దశలో సదరు డీల్ కుదరదన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ట్రంప్ వ్యాపారాలు పర్యవేక్షించే ఉన్నతాధికారుల బృందం కసరత్తును కొనసాగించింది. దీంతో చివరకు ట్రంప్ బిజినెస్ టీమ్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. చాలా సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న బిజినెస్ డీల్ ఒక కొలిక్కి వచ్చింది. దీంతో రాత్రికిరాత్రి డొనాల్డ్ ట్రంప్ ఆస్తుల విలువ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత సంపన్ను లైన తొలి 500 మందితో కూడిన జాబితాలో డొనాల్డ్ ట్రంప్‌నకు కూడా చోటు లభించింది. తాజా అంచనాల ప్రకారం డొనాల్డ్ ట్రంప్‌ సంపద నికర విలువ 4 బిలియన్‌ డాలర్లకుపైగా పెరిగింది. అంటే భారతీయ కరెన్సీలో రూ.33 వేల కోట్లకు ట్రంప్ సంపద పెరిగింది. ఈ నేపథ్యంలో తొలిసారిగా బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన వ్యక్తుల జాబితాలో డొనాల్డ్ ట్రంప్ చేరిపోయారు. గతంలో డ్రంప్ ఆస్తుల విలువ ఈ స్థాయిలో పెరగలేదు. ఈ లెవెల్లో డొనాల్డ్ ట్రంప్ ఆస్తులు పెరగడం ఇదే తొలిసారి.

అలాగే ట్రంప్‌నకు మరో రూపంలో అదృష్టం కలిసొచ్చింది. వ్యక్తిగత సంపదకు సంబంధించి గతంలో డొనాల్డ్ ట్రంప్ సమర్పించిన అఫిడవిట్‌లో అన్నీ అవాస్తవాలు ఉన్న విషయాన్ని అమెరికా న్యాయస్థానం గుర్తించింది. ఆదాయపు పన్ను ఎగ్గొట్టడానికి ఆస్తి విలువను తక్కువ చేసి చూపించినట్లు దిగువ కోర్టు పేర్కొంది. దీంతో డొనాల్డ్ ట్రంప్‌ను 500 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది న్యాయస్థానం. అయితే ఈ భారీ జరిమానాను నిలిపివేయాలని కోరుతూ ఇటీవల స్టేట్ అప్పీల్ కోర్టును డొనాల్డ్ ట్రంప్ ఆశ్రయించాడు. ఈ మేరకు న్యాయస్థానంలో ఓ పిటిషన్ దాఖలు చేశాడు ఆయన.

ట్రంప్ మహాశయుడి పిటిషన్‌పై స్టేట్ అప్పీల్ కోర్టు విచారణ జరిపింది. ట్రంప్‌నకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. గతంలో విధించిన భారీ జరిమానాను తగ్గించింది. గతంలో విధించిన 500 మిలియన్ డాలర్ల జరిమానాను 175 మిలియన్‌ డాలర్లకు తగ్గించింది న్యాయస్థానం. అంతేకాదు తగ్గించిన జరిమానాను పది రోజుల్లో ట్రంప్ చెల్లించాలని కోర్టు షరతు విధించింది. అలాగే తగ్గించిన సదరు జరిమానాను పది రోజుల్లో చెల్లిస్తే రూ.3,788 కోట్లు చెల్లించకుండా నిలుపుదల చేస్తామని కోర్టు స్పష్టం చేసింది.అదే సమయంలో సామాజిక మాధ్యమం విషయంలో కూడా ట్రంప్ననకు అదృష్టం కలిసొచ్చింది. ట్రంప్ సోషల్ మీడియా కంపెనీ అయిన ట్రంప్ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్ ఇటీవల డిజిటల్‌ వరల్డ్‌ అక్విజేషన్‌ కార్ప్‌లో విలీనమైంది. ఈ విలీనం ప్రక్రియ దాదాపు 29 నెలలుగా కొనసాగుతుంది. తాజాగా ఈ విలీనం ప్రక్రియ పూర్తయింది. డిజిటల్‌ వరల్డ్‌ అక్విజేషన్‌ కార్ప్‌లో ట్రంప్‌నకు 58 శాతం షేర్ల విలువ ఉంది. ఈ నేపథ్యంలో డిజిటల్‌ వరల్డ్‌ అక్విజేషన్‌ కార్ప్‌ షేర్లు తాజాగా 185 శాతం పెరిగాయి. దీంతో డొనాల్డ్ ట్రంప్ షేర్లకు అమాంతం రెక్కలొచ్చాయి. అంతిమంగా ట్రంప్ సంపద కూడా భారీగా పెరిగింది. ఈ కొత్త కంపెనీ తాజాగా నాన్‌డాక్‌లో డీజేటీ పేరిట ట్రేడింగ్ అవుతుంది. అయితే ఈ కొత్త కంపెనీలో ట్రంప్ కనీసం ఆరునెలల పాటు తమ వాటా షేర్లను విక్రయించకుండా ఉండాలి. డొనాల్డ్ ట్రంప్ సహజంగా ఎప్పుడూ వివాదాల్లో ఉంటారు. ట్రంప్ మహాశయుడు ఏం చేసినా అది హల్‌చల్‌ అవుతుంది. ఆయన ఏం మాట్లాడినా హాట్‌టాపికే అవుతుంది. కొన్నిసార్లు అనవసరపు విషయా ల్లో కూడా ట్రంప్ తలదూరుస్తుంటారు. చేయకూడని వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో అటు సంపద భారీగా పెరగడం ఇటు జరిమానా విషయంలో తగ్గింపు డొనాల్డ్ ట్రంప్‌నకు ఊరటనిచ్చాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్