20.7 C
Hyderabad
Wednesday, January 14, 2026
spot_img

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య: సీఎం కేసీఆర్

CM KCR | తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు… దొడ్డి కొమురయ్య చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… నాటి సాయుధ పోరాట కాలం నుంచి నేటి మలి దశ తెలంగాణ ఉద్యమకాలం దాకా దొడ్డి కొమురయ్య వంటి తెలంగాణ అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకుంటున్నామని అన్నారు. వారి ఆశయాల సాధనలో ముందుకు సాగుతున్నామని కొనియాడారు. దొడ్డి కొమురయ్య త్యాగానికి గుర్తుగా వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ వారికి ఘన నివాళులర్పిస్తున్నదని సీఎం తెలిపారు.

తెలంగాణ స్వయం పాలన ఆకాంక్షలకు ఊపిరిలూదిన సాయుధ పోరాట కాలపు తొలి అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం చిరస్మరణీయమన్నారు. అమరుల సంస్మరణార్థం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘అమర జ్యోతి’ త్వరలో ప్రారంభంకానున్నదని ఈ సంధర్బంగా తెలిపారు. బీసీ కుల వృత్తులను రాష్ట్ర ప్రభుత్వం పరిరక్షిస్తూ వారిని ప్రగతి పథంలో నడిపేందుకు అన్ని విధాలా సాయం అందిస్తుందన్నారు. ఇందులో భాగంగానే కుల వృత్తిదారులైన గొల్ల కుర్మల అభివృద్ధికోసం చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం.. వారి ఆర్థిక స్వావలంబనకు దోహదం చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.బీసీల కోసం ఏర్పాటు చేసిన ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలు, ఆసరా ఫించన్లు, రైతుబంధు సహా అనేక పథకాలు బీసీల ఆత్మగౌరవాన్ని, ఆర్థిక గౌరవాన్ని పెంపొందించాయని అన్నారు.

 

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్