ప్రాణాలు పోసే డాక్టర్లను దాడి చేసి హత్య చేసేందుకు యత్నించిన వారిని కఠినంగా శిక్షించాలని వైద్యులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఇటీవల కోరుట్లలో గదిలో ఉన్న వైద్యుడిని బంధించి డీజిల్ పోసి నిప్పంటిం చేందుకు ప్రయత్నించిన వారిని చట్ట పరిధిలో శిక్షించాలని డాక్టర్లు డిమాండ్ చేశారు. ఓ పేషంట్‌ను ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందినా, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ మృతుని బంధువులు దాడికి దిగడం హేయమైన చర్య అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు పేషంట్ ప్రాణాలను నిలబెట్టాలని చూస్తారే ప్రాణాలు తీయరని వారు అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో పేషంట్ ప్రాణాలు పోయిన ప్రతిసారి వైద్యులను బాధ్యులు చేయడం మంచిది కాదన్నారు. డాక్టర్‌పై సస్పెన్షన్ ఎత్తివేసే వరకు దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.


