స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక సీఎం పదవి ఎవరికి దక్కుతుందోనని ఉత్కంఠ క్షణం క్షణం పెరుగుతుంది. సీఎం పదవి చెరో రెండేళ్లు చేపట్టాలని కాంగ్రెస్ హై కమాండ్ ప్రతిపాదించిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, ఇద్దరు పంచుకోవడానికి సీఎం పదవి ఏమి వారసత్వ ఆస్తి కాదని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు అలాంటి ప్రతిపాదనేమి తన ముందుకు రాలేదని అన్నారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 135 అని.. దీన్ని ఎవరూ విగగొట్టలేరని పేర్కొన్నారు.
మరోవైపు కర్ణాటక సీఎం ఎన్నికపై చర్చించేందుకు ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఉదయం భేటీ అయ్యారు. ఢిల్లీ చేరుకున్న డీకే శివకుమార్ తోనూ కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరుపుతుంది. ఇద్దరి వాదనలు విన్న తర్వాత చివరకు సీఎం ఎవరనే విషయాన్ని సాయంత్రం తేల్చే అవకాశం ఉంది.