వ్యక్తిత్వ విలువలు, సమాజ వికాసాన్ని పెంచే విద్యా విధానం రాష్ట్రంలో రావాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి సీతక్క. ప్రస్తుత కాలానికి అనుగుణంగా సిలబస్‌ను సవరించాలని సీతక్క తెలిపారు. విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణల కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో భేటీ అయ్యింది. ప్రస్తుత కాలానికి అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు చేయాలని సూచించారు. విద్యార్ధులకు మంచి మార్కులతో పాటు మంచి నడవడిక నేర్పేలా మార్పులు జరగాలన్నారు. అమ్మాయిలు, మహిళలు అంటే చిన్న చూపు పొగొట్టేలా, లింగ సమానత్వం సాధించే దిశలో సెలబస్‌లో పాఠాలను చేర్చాలన్నారు. గత ప్రభుత్వం ఎంఈఓలను, డీఈఓలను నియమించకపోవడంతో పర్యవేక్షణ లేకుండా పోయిందన్నారు.