ఏపీ ఎన్డీయే కూటమిలో అనపర్తి టెన్షన్ నెలకొంది. పొత్తులో భాగంగా అనపర్తి అసెంబ్లీ టిక్కెట్ బీజేపీకి కేటాయించ డంతో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి సీటు కేటాయించకపోవడంతో కార్యకర్తల ఆగ్రహం వ్యక్తం చేస్తుననారు. నల్లమిల్లికి సీటు ఇవ్వ కపోతే రాజీనామా చేస్తామంటున్నారు. ఒకరిద్దరు కార్యకర్తలు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. వారిని వారించిన రామకృష్ణారెడ్డి… కుటుంబాన్ని, కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనపై ఉందన్నారు. తాను రాజకీయంగా మోసపోయానన్నారు. కాసేపట్లో తన కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.
అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్ధిగా శివకృష్ణంరాజును ప్రకటించింది ఏపీ బీజేపీ. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం రంగాపురం గ్రామానికి చెందిన ములగపాటి శివరామకృష్ణ రాజు తండ్రి రామరాజు. శివరామకృష్ణ రాజు భారత సైన్యంలో చేరి దాదాపు 9 రాష్ట్రాలలో మిలిటరీ ఇంటలిజెన్స్ విభాగంలో 16 సంవత్స రాలు వివిధ స్థాయిల లో పనిచేశారు. తండ్రి అనారోగ్య కారణాల రీత్యా సైన్యం నుండి పదవీ విరమణ తీసుకొన్న తరువాత RSSలో ప్రధార ప్రముఖ్‌గాచేశారు. తరువాత బీజేపీలో చేరి మండల అధ్యక్షుడిగా, నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా, జిల్లా మీడియా ప్యానలిస్ట్‌గా అంచలంచెలుగా ఎదిగి రెండు సంవత్సరాల నుండి అనపర్తి నియో జకవర్గ కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో శివరామ కృష్ణరాజు విశేష కృషి చేశారు. దీంతో.. ఆయననే అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ అధిష్టానం.


