బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ FDC ఛైర్మన్ దిల్‌రాజు. సీఎం రేవంత్‌రెడ్డితో జరిగిన చిత్ర పరిశ్రమ మీటింగ్‌పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఈ సమావేశంపై చిత్ర పరిశ్రమ ఎంతో సంతృప్తిగా ఉందన్నారాయన. హైదరాబాద్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా నిర్మించాలన్నది సీఎం బలమైన సంకల్పమన్నారు దిల్ రాజు.
అయితే..అనవసర వివాదాల్లోకి చిత్ర పరిశ్రమను లాగొద్దని కేటీఆర్‌కు సూచించారు. రాజకీయాలు ఆపాదించవద్దని మనవి చేశారు ఎఫ్‌డీసీ ఛైర్మన్. రాజకీయ దాడులు, ప్రతిదాడులకు సినీ పరిశ్రమను వాడుకోవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు వెల్లడించారు దిల్ రాజు.