కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లిలో డయేరియా ప్రబలింది. గ్రామంలో సుమారు 50 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో అక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు అధికారులు. తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఐదుగురు బాధితులను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డయేరియాతో ఒకరు మృతి చెందారు. డయేరియా ప్రబలడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. గ్రామం లోని నీరు, ఆహార నమూనాలను పరిశీలిస్తున్నారు. పరిస్థితిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్య వేక్షిస్తున్నారు.


