తెలంగాణలో ఫ్రీ బస్సు ప్రయాణంపై కేటీఆర్, సీతక్క మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. బస్సులో మహిళలు కొట్టుకుంటున్నారని, బస్సుల సంఖ్యను పెంచి రికార్డు డ్యాన్సులు చేసుకోండని చేసిన కేటీఆర్ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటరిచ్చారు. మహిళలంటే కేటీఆర్‌కు గౌరవం లేదన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని చెప్పారామె.