కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివాసీల ధర్నా చేశారు. జైనూర్ మండలం ఎంపీడీఓ కార్యాలయం ముందు వారు ధర్నా నిర్వహించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను అధికారులు తుంగలో తొక్కి, వలస వచ్చిన ఇతరులకు వత్తాసు పలుకుతున్నారని ఆదివాసీ లు ఆరోపించారు. అలాంటి అధికారులపై శాఖాప రమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆసిఫాబాద్ ఆర్డీఓకు ఆదివాసీలు అందజేశారు. ఈ కార్యక్రమం లో ఆదివాసి సంక్షేమ పరిషత్, ఆదివాసి మహిళా సంక్షేమ పరిషత్, రాయి సెంటర్ సభ్యులు,ఇతర సంఘాల సభ్యులు ఉన్నారు.


