స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: సీఎం జగన్ ద్వారానే రాష్ట్ర సుపరిపాలన సంక్షేమం అభివృద్ధి సాధ్యమవుతుందని పర్యాటక శాఖా మంత్రి రోజా అన్నారు. 2024లోనూ మళ్లీ జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నగరి మున్సిపాలిటీ పరిధిలోని నగరి వెస్ట్ సచివాలయం పరిధిలోని 26వ, 25వ వార్డులో మంత్రి పర్యటించారు. తమ ఏరియాకి వచ్చిన మంత్రికి గజమాలతో ఘనస్వాగతం పలికారు అభిమానులు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ… జగనన్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతుతున్నాయా అంటూ ప్రతి ఒక్కరిని పలకరించారు. దుష్ట చతుష్టయం ఎన్ని కుట్రలు పన్నినా… 2024లో జగన్మోహన్ రెడ్డిని ఓడించలేరన్నారు. సీఎం జగన్ ప్రవేశ పెట్టిన పథకాలు అన్ని వివరిస్తూ… లబ్ది పొందని వారికి త్వరగా పథకాలు అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.