స్వతంత్ర, వెబ్ డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నల్గొండ జిల్లా దేవరకొండకు చేరుకుంది. ఈ క్రమంలో దేవరకొండ పట్టణంలో పాదయాత్ర కార్నర్ మీటింగ్ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో కాంగ్రెస్ పార్టీలో మరోసారి బయటపడ్డ వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఇదివరకే కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇప్పుడు కార్నర్ మీటింగ్ వద్ద భట్టి పాదయాత్రలో మరోసారి కాంగ్రెస్ ఇరు వర్గాలు దాడి చేసుకున్నారు. ఈ ఘటనపై అసహనం వ్యక్తం చేసిన భట్టి విక్రమార్క.. ఇలాగే చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్నర్ మీటింగ్ కు రాజ్యసభ సభ్యురాలు రంజిత్ రంజన్, ఏఐసిసి సెక్రెటరీ మంథని శాసనసభ్యులు దుద్దిల శ్రీధర్ బాబు, నల్లగొండ పార్లమెంటు సభ్యులు మాజీ పీసీసీ అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు కుందూరు జానారెడ్డి, మాజీ శాసనసభ్యులు కేఎల్ఆర్, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు తదితర కాంగ్రెస్ అగ్ర నేతలు హాజరైయ్యారు.